Cm Kcr On Sarvai Papanna: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్..తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి ప్రతీక అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. సబ్బండ వర్గాల ఆత్మగౌరవ స్ఫూర్తిగా నిలిచిన సర్వాయి పాపన్న వీరగాధను, పాపన్న జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. ఈ కార్యక్రమం ప్రగతి భవన్లో జరిగింది. ఆనాటి సమాజంలో నెలకొన్న నిరంకుశ రాజరిక పోకడలకు వ్యతిరేకంగా అన్ని వర్గాలను పాపన్న ఏకం చేశారని ముఖ్యమంత్రి అన్నారు. ఆయన పోరాడిన తీరు గొప్పదని సీఎం కేసీఆర్ అన్నారు.
Cm Kcr On Sarvai Papanna వీరత్వానికి, ప్రతీకకు పాపన్న స్ఫూర్తి - సర్వాయి పాపన్న జయంతి
Cm Kcr On Sarvai Papanna తెలంగాణ వీరత్వానికి సర్వాయి పాపన్న ప్రతీకగా నిలిచారని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఆయన జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్లో కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణలో ఉన్న అన్ని వర్గాలను ఏకం చేశారన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్
సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు. పాపన్న స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాల నాయకత్వాన్ని సముచితంగా గౌరవించుకుంటున్నదని అన్నారు. అణచివేత, వివక్షకు వ్యతిరేకంగా పాపన్న గౌడ్ ప్రదర్శించిన ఆత్మగౌరవ పోరాట స్ఫూర్తిని తెలంగాణ రాష్ట్రం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
ఇవీ చదవండ: