జమ్మూకశ్మీర్ మాచిల్ సెక్టార్ కాల్పుల్లో వీరమరణం పొందిన జవాను మహేశ్ మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. జవాన్ కుటుంబానికి ప్రభుత్వ పరంగా రూ.50 లక్షలు ఆర్థిక సాయం అందించనున్నట్లు వెల్లడించారు. అర్హతను బట్టి మహేశ్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.
వీరజవాన్ మహేశ్ కుటుంబానికి ఆర్థికసాయం ప్రకటించిన కేసీఆర్ - Cm kcr mourns jawan mahesh's death
జమ్మూకశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్ మహేశ్ మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశరక్షణ కోసం ప్రాణాలర్పించిన యోధిడిగా మహేశ్ చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు.
జవాన్ మహేశ్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
దేశరక్షణలో ప్రాణాలర్పించిన జవాన్ మహేశ్ ఒక యోధుడిగా చరిత్రలో నిలిచిపోతారని సీఎం కేసీఆర్ అన్నారు. మహేశ్ కుటుంబానికి ఇంటి స్థలం కూడా కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి :'చిన్నప్పటి నుంచి సైన్యంలో చేరాలన్న తపనే'