దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్... కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురితో భేటీ అయ్యారు. కేవలం పది నిమిషాలు మాత్రమే సాగిన ఈ సమావేశంలో... రాష్ట్రంలో ఆరు డొమెస్టిక్ ఎయిర్ పోర్టుల అభివృద్ధికి వెంటనే చర్యలు తీసుకోవాలని హరిదీప్ పురిని సీఎం కేసీఆర్ కోరారు. బసంత్ నగర్, మామునూరు, ఆదిలాబాద్, జక్రంపల్లి, దేవరకద్ర, భద్రాద్రి కొత్తగూడెంలో విమానాశ్రయాలకు సంబంధించిన డీపీఆర్‌లు ఇప్పటికే తయారు చేశారని పేర్కొన్నారు.
'రాష్ట్రంలో డొమెస్టిక్ ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి చర్యలు తీసుకోండి' - siddipet airport updates
14:30 December 12
కేంద్ర మంత్రి హర్‌దీప్‌సింగ్ పురికి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి
ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఈ విమానాశ్రయాలపై సర్వే కూడా జరిపినట్లు కేసీఆర్ వివరించారు. ఈ విమానాశ్రయాలకు సంబంధించిన ప్రతిపాదనలను 2018 లోనే రాష్ట్ర ప్రభుత్వం సమర్పించినట్లు పేర్కొన్నారు. ఈ ఎయిర్ పోర్టుల అభివృద్ధికి అవసరమైన అన్ని అనుమతులను సింగిల్ విండో తరహాలో వచ్చేలా చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రిని కోరారు.
మరికొందరు కేంద్రమంత్రులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై కేంద్రమంత్రులతో సీఎం చర్చించనున్నారు. అవకాశం ఉంటే ప్రధాని నరేంద్రమోదీతోనూ కేసీఆర్ సమావేశం అవుతారని.. ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దిల్లీలో తెరాస కార్యాలయ నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని కేసీఆర్ పరిశీలించనున్నారు.
ఇదీ చూడండి:అమిత్‌షాతో కేసీఆర్ భేటీ... విపత్తు నిధుల సాయంపై చర్చ