రాష్ట్రంలోని ఆరు జిల్లాల పార్టీ ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం ముగిసింది. ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రజలు ఏమనుకుంటున్నారో సీఎం కేసీఆర్ ఆరా తీశారు. ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పలువురు నేతలు సీఎంకు తెలిపారు. రెండు ఎమ్మెల్సీ పట్టభద్ర స్థానాల్లోనూ తెరాసదే గెలుపు ఉంటుందని నేతలు పేర్కొన్నారు.
యువత తెరాసకు వ్యతిరేకమన్న ప్రచారం తిప్పికొట్టాలి: కేసీఆర్ - ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం కేసీఆర్ సమీక్ష
12:59 October 03
యువత తెరాసకు వ్యతిరేకమన్న ప్రచారం తిప్పికొట్టాలి: కేసీఆర్
నిరుద్యోగులు, యువకులు తెరాసకు వ్యతిరేకమన్న ప్రచారం తిప్పికొట్టాలని కేసీఆర్ సూచించారు. ఉద్యమ కాలం నుంచి యువత అంతా తెరాసతోనే ఉన్నారని సీఎం అన్నారు. పట్టభద్రుల ఓటరు నమోదుపై తెరాస నేతలు దృష్టి పెట్టాలని తెలిపారు. జీహెచ్‌ఎంసీ, దుబ్బాకలో సర్వేలన్నీ మాకే అనుకూలంగా ఉన్నాయన్నారు. రెవెన్యూ, మున్సిపల్ చట్టాలపై ప్రజలకున్న అపోహలు తొలగించాలని పేర్కొన్నారు. ఆస్తులన్నీ రికార్డుల్లోకి ఎక్కేలా ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న జిల్లాల ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్ సహా ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల నేతలతో ప్రగతి భవన్లో భేటీ అయ్యారు.
ఇదీ చూడండి :హైకోర్టు కీలక ఆదేశం.. ఎంపీలు, ఎమ్మెల్యేల కేసుల్లో రోజువారీ విచారణ