మూడు రోజుల పర్యటనలో భాగంగా దిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్... సాయంత్రం 4.30 గంటలకు ప్రధానితో భేటీ కానున్నారు. గోదావరి - కృష్ణా నదుల అనుసంధానానికి కేంద్రం తోడ్పాటు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన అంశాలపై ప్రధానితో చర్చించనున్నారు. రిజర్వేషన్ల పెంపు, విభజన చట్టం హామీలు వంటి పెండింగ్ అంశాలు ప్రస్తావించనున్నట్లు సమాచారం.
ప్రధానితో భేటీ తర్వాత శుక్ర, శనివారాల్లో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, నిర్మలాసీతారామన్, నితిన్‌గడ్కరీ, పీయూష్‌గోయల్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ కలుస్తారని సమాచారం. హైదరాబాద్‌లో అభివృద్ధి పనులకు రక్షణ శాఖ భూముల కేటాయింపు, తెలంగాణకు కేంద్ర ఆర్థిక సాయం, జాతీయ రహదారుల ప్రతిపాదనలకు ఆమోదం, రైల్వే కోచ్‌ల కర్మాగారం, ఇతర ప్రాజెక్టుల పనులపై కేసీఆర్ వారితో చర్చిస్తారు.