గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ... ఆర్టీసీపై కీలక చర్చ - cm kcr on tsrtc strike
07:41 November 25
గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ... ఆర్టీసీపై కీలక చర్చ
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. మధ్యాహ్నం రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం... గవర్నర్‌తో రెండున్నర గంటలకు పైగా సమావేశమయ్యారు. గవర్నర్ ప్రమాణస్వీకారంతో పాటు మంత్రుల ప్రమాణస్వీకారం సందర్భంగా సెప్టెంబర్ 8న రాజ్‌భవన్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి.. మళ్లి ఇదే తొలిసారి. ఆర్టీసీ కార్మికుల సమ్మె వ్యవహారం సహా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న తాజా పరిణామాలపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం.
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు వివరించడంతో పాటు 5,100 ప్రైవేట్ బస్సులకు రవాణా అనుమతుల విషయాన్ని గవర్నర్ దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పినట్లు సమాచారం. రెవెన్యూశాఖలో ప్రక్షాళన కోసం కొత్త రెవెన్యూ చట్టం సహా ఇతర అంశాలపై సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిసింది. గవర్నర్ దిల్లీ పర్యటన, రాజ్‌భవన్‌లో రేపు జరగనున్న రాజ్యాంగదినోత్సవం తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.