గవర్నర్ తమిళిసైతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం - kcr governor tamilisai latest news
11:05 October 02
గవర్నర్ తమిళిసైతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం
గవర్నర్ తమిళిసైతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. బాపూఘాట్లో మహాత్మాగాంధీకి నివాళులు అర్పించిన అనంతరం సీఎం కేసీఆర్... నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలపై ఇరువురు చర్చించారు. దసరా రోజు నుంచి ధరణి పోర్టల్, కొత్త రెవెన్యూ విధానం ప్రారంభం, వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియను ప్రారంభం వంటి వివరాలను గవర్నర్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు.
ఈ నెల ఆరో తేదీన జరగనున్న అపెక్స్ కౌన్సిల్ సమావేశం కూడా వీరి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలు, రాయలసీమ ఎత్తిపోతల వల్ల రాష్ట్రానికి కలిగే నష్టాలు సహా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని సీఎం వివరించినట్లు తెలిసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు సహా తాజా పరిణామాలు, ఇతర అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. రాజ్ భవన్లో ఇవాళ్టి నుంచి ప్రారంభం అవుతున్న ఈ-ఆఫీస్ విధానం గురించి గవర్నర్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించినట్లు సమాచారం.