అసెంబ్లీలో ఇవాళ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సీఏఏ అంశాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్.. సీఏఏపై శాసనసభలో చర్చ ఉంటుందని స్పష్టం చేశారు. సీఏఏపై ఎవరి అభిప్రాయాలను వారు చెబుతారు... అందులో తప్పేమి లేదన్నారు.
సీఏఏపై అసెంబ్లీలో ఒక పూట చర్చిద్దాం: సీఎం కేసీఆర్ - తెలంగాణ బడ్జెట్ సమావేశాలు -2020
సీఏఏపై శాసనసభలో చర్చ ఉంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఒక పూట మొత్తం కేటాయించి ప్రతి ఒక్కరి అభిప్రాయాలు తీసుకుంటామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
![సీఏఏపై అసెంబ్లీలో ఒక పూట చర్చిద్దాం: సీఎం కేసీఆర్ cm kcr latest speech on caa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6326398-thumbnail-3x2-kcr.jpg)
సీఏఏపై ఒక పూట చర్చిద్దాం..
పౌరసత్వ సవరణ చట్టం బిల్లు చాల కీలకమైన అంశమని పేర్కొన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో చర్చ జరగాలని చెప్పారు. అన్నిపార్టీల వారికి అవకాశం కల్పిస్తామని సీఎం వెల్లడించారు. సీఏఏపై ఇప్పుడు చర్చించటం సరైంది కాదని అక్బరుద్దీన్ ఒవైసీకి సూచించారు. అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి పంపుదామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
సీఏఏపై అసెంబ్లీలో ఒక పూట చర్చిద్దాం: సీఎం కేసీఆర్
ఇవీ చూడండి:ప్రగతిలో భేష్: దేశానికే ఆదర్శంగా తెలంగాణ: గవర్నర్
Last Updated : Mar 7, 2020, 2:38 PM IST