మెట్రో ప్రారంభోత్సవంలో అరుదైన దృశ్యం... - cm kcr and revanth reddy meet at metro opening
జేబీఎస్ - ఎంజీబీఎస్ మెట్రో ప్రారంభోత్సవంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఉప్పు నిప్పుగా ఉండే వాళ్లు ఒకే వేదికపైకి వచ్చారు. చాలా కాలం పాటు ప్రజాప్రతినిధులుగా ఉన్నా... తారసపడిన సందర్భాలంటూ లేవేమో! పొలిటికల్ గ్రౌండ్లో విమర్శించుకున్నా... మెట్రో కారిడార్లో మాత్రం చిరునవ్వులు చిందించారు. జేబీఎస్ పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లో సీఎం కేసీఆర్... రిబ్బన్ కత్తిరిస్తుండగా... కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పక్కన నిలబడ్డారు. రేవంత్ చేతిని ఉప సభాపతి పద్మారావు పట్టుకోవడం ఆసక్తి కలిగించింది.
మెట్రో ప్రారంభోత్సవంలో అరుదైన దృశ్యం...
Last Updated : Feb 7, 2020, 11:35 PM IST