తెలంగాణ

telangana

ETV Bharat / city

అరాచక శక్తుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలి: కేసీఆర్ - అరాచక శక్తుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలి: కేసీఆర్

అరాచక శక్తుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలి: కేసీఆర్
అరాచక శక్తుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలి: కేసీఆర్

By

Published : Nov 25, 2020, 8:04 PM IST

Updated : Nov 25, 2020, 8:50 PM IST

20:02 November 25

అరాచక శక్తుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలి: కేసీఆర్

రాష్ట్రంలో ఘర్షణలు, మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కొన్ని అరాచక శక్తులు కుట్ర పన్నుతున్నాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై  ముఖ్యమంత్రి ‌ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు హైదరాబాద్‌ శాంతికాముక నగరంగా పేరుగాంచిందని, కానీ, కొన్ని అరాచక శక్తులు తీవ్ర నిరాశ, నిస్పృహకు లోనై  నగరంలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. అరాచక శక్తుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని అధికారులను సీఎం ఆదేశించారు. 

అరాచక శక్తుల కుట్రల విషయమై ప్రభుత్వానికి కచ్చితమైన సమాచారం ఉందని, హైదరాబాద్‌, రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడటమే అత్యంత ప్రాధానమని సీఎం స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:రాష్ట్ర ప్రభుత్వానికి ఆ విషయంలో ప్రధాని మోదీ ప్రశంసలు

Last Updated : Nov 25, 2020, 8:50 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details