యాసంగిలో అమలు చేయాల్సిన నిర్ణీత పంటల సాగు విధానం, గ్రామాల్లోనే వానాకాలం పంటల కొనుగోలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, సీనియర్ అధికారులతో ప్రగతి భవన్లో సీఎం సమావేశమయ్యారు. యాసంగిలో సాగు చేయాల్సిన, వేయకూడని పంటలు, లాభాలు వచ్చే పంటలు తదితర అంశాలపై సమీక్షిస్తున్నారు.
వానాకాలం పంటల కొనుగోళ్లు, యాసంగిలో సాగు విధానంపై సీఎం సమీక్ష - వ్యవసాయ శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష
14:59 October 10
వానాకాలం పంటల కొనుగోళ్లు, యాసంగిలో సాగు విధానంపై సీఎం సమీక్ష
కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మొక్కజొన్న దిగుమతి చేసుకుంటోంది. ఈ ప్రభావం దేశంలో మొక్కజొన్న కొనుగోలుపై పడనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మొక్కజొన్న సాగుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ విషయమై సమావేశంలో విస్తృతంగా చర్చిస్తారు. కరోనా ముప్పు ఇంకా తొలగనందున రైతుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వ్యవసాయ ఉత్పత్తలు కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కొనుగోళ్లకు సంబంధించిన ఏర్పాట్లను సీఎం సమీక్షిస్తారు.
అనంతరం కేబినెట్ భేటీ
ఆరువేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరపాలని... ఇందుకోసం ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. పంటలు కొనుగోలు చేసిన తర్వాత వీలైనంత తక్కువ సమయంలో రైతులకు డబ్బులు చెల్లించాలన్న సీఎం... ఆ దిశగా అన్ని ఏర్పాట్లు ముందుగానే చేయాలని చెప్పారు. ఈ అంశాలన్నింటిపైనా సమావేశంలో చర్చించనున్నారు. అనంతరం జరగనున్న మంత్రివర్గ సమావేశంలోనూ యాసంగిలో నిర్ణీత విధానంలో పంటలసాగు, వానాకాలం పంటల కొనుగోళ్ల విధానంపై కూడా చర్చించనున్నారు.
ఇదీ చదవండి :బుజ్జాయిలు ఇంటికి వచ్చేలోపు ఈ ఏర్పాట్లు చేసుకున్నారా?