తెలంగాణ

telangana

ETV Bharat / city

గోదావరి జలాలపై సీఎం దృష్టి.. 17న ప్రత్యేక భేటీ

గోదావరి నదీ జలాల వినియోగంపై సీఎం కేసీఆర్​ దృష్టి సారించారు. మంత్రులు, నీటిపారుదల శాఖ అధికారులతో ఎల్లుండి భేటీ కానున్నారు. గోదావరి ప్రాజెక్టుల నుంచి ఈ వర్షాకాలంలో నీరు విడుదల గురించి చర్చించనున్నారు.

cm-kcr-held-meeting-on-godavari-water-useg-in-17th-may
గోదావరి జలాలపై సీఎం దృష్టి.. 17న ప్రత్యేక భేటీ

By

Published : May 15, 2020, 2:32 PM IST

వర్షాకాలంలో గోదావరి నదీ జలాల వినియోగ ప్రణాళికపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఈ నెల 17న సీఎం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరగనుంది. గోదావరి ప్రాజెక్టులు, పరివాహక ప్రాంతాల మంత్రులు, అధికారులతో జరిగే ప్రత్యేక సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభమై, రోజంతా కొనసాగనుంది.

గోదావరి ప్రాజెక్టుల నుంచి ఈ వర్షాకాలంలో నీరు విడుదల, ఎస్​ఆర్​ఎస్పీ, ఎల్ఎండీలకు నీటి తరలింపు, మిగతా జలాశయాలకు నీటి తరలింపు, వినియోగం, తదితర అంశాలపై సమావేశంలో విస్తృత చర్చ జరుగుతుంది. గోదావరి నదీ పరివాహక జిల్లాల మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఈటల రాజేందర్, కేటీఆర్​, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్​ రావు, సత్యవతి రాథోడ్, జగదీష్ రెడ్డిని సమావేశానికి ఆహ్వానించారు.

నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఈఎన్సీ మురళీధర్, ఎస్​ఆర్​ఎస్పీ సీఈ శంకర్, కాళేశ్వరం ఈఎన్సీ వెంకటేశ్వర్లు, ఇతర సీనియర్ నీటి పారుదల ఇంజనీర్లు భేటీలో పాల్గోనున్నారు.

ఇవీ చూడండి:రైతులకు అండ... ఈ కార్గో బస్సు సర్వీసులు

ABOUT THE AUTHOR

...view details