రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఇప్పటికే చర్యలు చేపట్టిన ప్రభుత్వం.. మరింత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన అత్యవసర, అత్యున్నత రాష్ట్ర స్థాయి సమావేశం జరగనుంది.
కాసేపట్లో కరోనాపై సీఎం అత్యున్నత స్థాయి సమావేశం - Case of coronavirus in telangana
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన అత్యవసర, అత్యున్నతస్థాయి సమీక్ష జరగనుంది. సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. ఈ భేటీలో కరోనా నివారణపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
cm kcr
మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతిభవన్‌లో జరిగే భేటీకి... మంత్రులు, కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు హాజరుకానున్నారు. ప్రగతి భవన్కు మంత్రి ఈటల, వైద్యశాఖ అధికారులు చేరుకున్నారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో ఒక్కరోజే ఎనిమిది కరోనా పాజిటివ్ కేసులు