ఈనెల 19న మంత్రివర్గ సమావేశం.. లాక్‌డౌన్‌పై చర్చ - Covid-19 latest news
11:15 April 16
ఈనెల 19న మంత్రివర్గ సమావేశం.. లాక్‌డౌన్‌పై చర్చ
రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగింపు, సడలింపులపై ఈ నెల 19న మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. ఇందుకోసం ఆదివారం మధ్యాహ్నం 2.30కి కేబినెట్ సమావేశం కానుంది. ప్రగతి భవన్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో.. రాష్ట్రంలో కరోనా వ్యాధి పరిస్థితి, వైరస్ వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై చర్చిస్తారు.
అన్ని అంశాలపై విస్తృతంగా చర్చించి తదుపరి కార్యాచరణను రాష్ట్ర మంత్రివర్గం ఖరారు చేయనుంది. రాష్ట్రంలో లాక్ డౌన్ నెలాఖరు వరకు ఉండగా... దేశవ్యాప్తంగా వచ్చే నెల మూడో తేదీ వరకు లాక్ డౌన్‌ను కేంద్రం పొడిగించింది. ఈ నెల 20 నుంచి కొన్ని మినహాయింపులను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగింపు, సడలింపుల అంశంపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.