జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతామని గతంలో పలు సందర్భాల్లో బహిరంగంగా వెల్లడించిన గులాబీ పార్టీ(trs party focus on national politics)... ఒక అడుగు ముందుకు.. మరో అడుగు వెనక్కి అన్నట్లు వ్యవహరిస్తూ వస్తోంది. ప్రస్తుతం.. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం సమస్యలే ప్రధాన అజెండాగా తెరాస దూసుకెళ్తోంది. రాష్ట్రంలో వరి కొనుగోళ్ల(paddy procurement in telangana)పై స్పష్టతనివ్వాలంటూ ఆందోళనలు ప్రారంభించిన గులాబీ పార్టీ... జాతీయ స్థాయి రైతాంగం అంశాలన్నింటిపై ఫోకస్ చేస్తూ ఉద్యమాన్ని చేసే దిశగా కదలుతోంది. అవసరమైతే భారత రైతాంగానికి తెరాస నాయకత్వం వహిస్తుందని కేసీఆర్ ఇటీవల స్పష్టంగా ప్రకటించారు. మహాధర్నా మరుసటి రోజునే ప్రధాని నరేంద్రమోదీ వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడం... కేసీఆర్ ఘనతేనంటూ తెరాస శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు జరిపాయి.
కేసులన్ని ఎత్తివేయాలని డిమాండ్..
ఈ మేరకు దూకుడు పెంచిన సీఎం... సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో మరణించిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున 3 లక్షల రూపాయల చొప్పున కేసీఆర్ ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అమరులైన సుమారు 700 మంది రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు 28 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. కేంద్రం ప్రభుత్వం కూడా ఒక్కో రైతు కుటుంబానికి 25 లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. వ్యవసాయ చట్టాల రద్దు భారత రైతాంగం సాధించిన అద్భుత విజయంగా అభివర్ణించిన గులాబీ పార్టీ అధ్యక్షుడు... ప్రధాని మాటలను దేశవ్యాప్తంగా ఎవరూ నమ్మడం లేదని వ్యాఖ్యానించారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల స్టంటుగా ప్రచారం జరుగుతోందన్నారు. రైతాంగ ఉద్యమానికి సంబంధించిన కేసులన్నీ ఎత్తివేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. వ్యవసాయ చట్టాలకు తెరాస ఎప్పుడూ మద్దతివ్వలేదని కేసీఆర్ పేర్కొన్నారు.
మద్దతు ధర చట్టంపై..