జాతీయ స్థాయిలో నీటిపారుదల అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు. దేశంలో గుణాత్మక మార్పే ధ్యేయం ఆంటోన్న సీఎం... గత కొన్నాళ్లుగా జాతీయ స్థాయిలోని వివిధ అంశాలను ప్రస్తావిస్తున్నారు. దేశంలో 70 వేల టీఎంసీల నీటి లభ్యత ఉన్నప్పటికీ సాగునీరు, తాగునీటి కోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని... వ్యవస్థలో మార్పులు రావాలని కేసీఆర్ పదేపదే అంటున్నారు. అందుకు సంబంధించిన అంశాలపై గత కొన్నాళ్లుగా సీఎం కసరత్తు చేస్తున్నారు.
జాతీయ స్థాయిలో నీటిపారుదల అంశాలపై సీఎం కేసీఆర్ దృష్టి..! - KCR focused on national wide irrigation issues
ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జలసంఘం మాజీ ఛైర్మన్ మసూద్ హుస్సేన్‌తో ప్రగతి భవన్‌లో భేటీ అయ్యారు. ఆయనతో పాటు నీటిపారుదల శాఖ ఇంజినీర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్లు సమాచారం. రాష్ట్రంలోని నీటిపారుదల అంశాలు, ప్రాజెక్టులతో పాటు దేశంలోని నీటిపారుదల అంశాలపై ఈ భేటీలో చర్చించినట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలోనే.. జాతీయ జలసంఘం మాజీ ఛైర్మన్ మసూద్ హుస్సేన్ సోమవారం రోజు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి భేటీ అయ్యారు. మసూద్ హుస్సేన్‌తో పాటు నీటిపారుదల శాఖ ఇంజినీర్లు కూడా సమావేశంలో పాల్గొన్నట్లు సమాచారం. రాష్ట్రంలోని నీటిపారుదల అంశాలు, ప్రాజెక్టులతో పాటు దేశంలోని నీటిపారుదల అంశాలపై భేటీలో చర్చించినట్లు తెలిసింది. దేశంలో అందుబాటులో ఉన్న నీరు, తాగు-సాగు నీటి అవసరాలు, ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్‌లో ఉత్పన్నమయ్యే పరిస్థితులు తదితర అంశాలు సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం. మరికొంత మంది నిపుణులు, విశ్రాంత ఇంజినీర్లతోనూ సీఎం కేసీఆర్ సమావేశమవుతారని అంటున్నారు.
ఇవీ చూడండి :వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టిన బైక్.. 30 అడుగులు ఎగిరిపడి అక్కడిక్కడే..