30 రోజుల ప్రణాళిక విజయవంతం: కేసీఆర్ - 30 రోజుల కార్యచరణ విజయవంతం
పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రతను పెంచే లక్ష్యంతో సర్కారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన 30రోజుల కార్యాచరణ ప్రణాళిక దిగ్విజయంగా పూర్తయిందని ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యచరణ ప్రణాళికను విజయవంతం చేసిన వారందరికి ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం అమలుపై సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల అభివృద్ధికి నెలకు రూ.339 కోట్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో విద్యుత్ శాఖ ప్రథమ స్థానంలో నిలిచిందని అభినందించారు. గ్రామాల్లో పవర్ వీక్ నిర్వహించి విద్యుత్ సమస్యలు పరిష్కరించిందని తెలిపారు. ఈ ప్రణాళిక విజయవంతం అవడంలో ముఖ్యపాత్ర పోషించిన అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ కార్యదర్శులు, ప్రజలకు అభినందనలు తెలిపారు. భవిష్యత్నోనూ ఇదే స్ఫూర్తి కొనసాగించాలని కోరారు.
- ఇదీ చూడండి : జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం ప్రారంభం