భాజపా నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు సీఎం కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈటలకు కేసీఆర్ లేఖ పంపారు. ఈటలకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుడిని కోరుకున్నట్లు లేఖలో తెలిపారు.
శామీర్‌పేట్‌లోని ఈటల రాజేందర్ నివాసంలో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కేకు కట్ చేసి బర్త్‌డేను జరుపుకున్నారు. ఈ వేడుకల్లో ఈటల అభిమానులు, పార్టీ నేతలు పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఈటల రాజేందర్‌కు గవర్నర్ తమిళిసై పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈటల నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని... ప్రజాసేవలో తరించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు.