ఓ వైపు కొవిడ్ 19 వైరస్ వ్యాప్తి నివారణ చర్యలు తీసుకుంటూనే మరోవైపు కరోనాతో కలిసి జీవించే వ్యూహం రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై ప్రగతి భవన్లో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా ఎంతకాలం ఉంటుందో ఎవరికీ తెలియని పరిస్థితి ఉందని, కాబట్టి కరోనా ప్రభావం ఉన్నప్పటికీ జీవితం ఎలా సాగాలనే విషయంలో కచ్చితమైన వ్యూహం, ప్రణాళిక అవసరమని అన్నారు.
దాంట్లో ఎలాంటి సందేహం లేదు
వైరస్ వ్యాప్తి నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని... ఇప్పటి తరహాలోనే అత్యుత్తమ సేవలు అందాలని సీఎం స్పష్టం చేశారు. కాంటాక్ట్ వ్యక్తులకు పరీక్షలు జరగాలని, ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకకుండా కచ్చితమైన క్వారంటైన్ నిబంధనలు పాటించాలని ముఖ్యమంత్రి తెలిపారు. అన్ని రకాల వైద్యపరికరాలు, మందులు, సదుపాయాలతో సిద్ధంగా ఉన్నామని... వైద్య పరంగా అత్యుత్తమంగా స్పందిస్తామని చెప్పారు. అందులో ఎలాంటి సందేహం లేదని తెలిపారు.