సింగరేణి ఉద్యోగులకు సీఎం కేసీఆర్ దసరా కానుక - సింగరేణి ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుక
14:16 September 28
సింగరేణి ఉద్యోగులకు సీఎం కేసీఆర్ దసరా కానుక
సింగరేణి ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుక ప్రకటించింది. 2021-22 సంవత్సరానికి గాను సంస్థ సాధించిన లాభాల్లో 30 శాతం వాటాను ఉద్యోగులకు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహకాన్ని దసరాలోపు చెల్లించాలని సింగరేణి సీఎండీ శ్రీధర్‌ను ఆదేశించారు. ఈ మేరకు సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగరావు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అర్హులైన కార్మికులకు 368 కోట్ల రూపాయలను సింగరేణి సంస్థ చెల్లించనుంది.
2020 సంవత్సరంలోనూ సింగరేణి ఉద్యోగులకు లాభాల్లో 28% వాటాను రాష్ట్రం ప్రభుత్వం దసరా కానుకగా అందించింది. అలాగే గత సంవత్సరం కూడా 29% వాటాను విజయదశమి కానుకగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈసారి గతేడాది కంటే ఒక శాతం పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. లాభాల్లో 30% వాటాను ఉద్యోగులకు దసరాలోపు అందించాలని సింగరేణి సీఎండీని ఆదేశించారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై సింగరేణి ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. పండుగ సందర్భంగా బోనస్ ప్రకటించినందుకు గానూ.. సీఎం కేసీఆర్‌కు టీజీబీకేఎస్ నేతలు ధన్యవాదాలు తెలియజేశారు.
ఇవీ చదవండి: