కొద్దిరోజులుగా రాష్ట్రమంతా అగ్గిరాజేస్తున్న యురేనియం తవ్వకాలపై ఎట్టకేలకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టతనిచ్చారు. యురేనియం తవ్వకాలపై తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి అనుమతులు గతంలో ఇవ్వలేదని, భవిష్యత్లో కూడా ఇవ్వబోమని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ నేత భట్టి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... యురేనియం తవ్వకాలపై అనుమతినిరాకరిస్తూ కేంద్రానికి త్వరలోనే తీర్మానం పంపుతామని తెలిపారు. నల్లమల అడవులను నాశనం కాకుండా చూస్తామని, అవసరమైతే కేంద్రంతో పోరాడతామన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రజలెవరూ భయాందోళనకు గురికావద్దని సూచించారు.
యురేనియం తవ్వకాలకు అనుమతివ్వం: సీఎం కేసీఆర్ - cm kcr on uranium mining
యురేనియం తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేత భట్టి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.
యురేనియం తవ్వకాలకు అనుమతివ్వం: సీఎం కేసీఆర్
Last Updated : Sep 15, 2019, 2:52 PM IST