రూ. 3 లక్షల కోట్ల అప్పుందని నిరూపిస్తారా? - కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి
తెలంగాణలో అభివృద్ధి కనబడటం లేదా అని ముఖ్యమంత్రి కేసీఆర్... కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్కను ప్రశ్నించారు. ప్రపంచం మొత్తం రాష్ట్ర ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుంటుంటే...ఒక్కటి కూడా కనబడటం లేదని ఎలా అంటున్నారని నిలదీశారు. లేనిది ఉన్నట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. 2 లక్షల కోట్ల అప్పును మూడు లక్షల కోట్లని చెబుతున్నారు... అది నిరూపిస్తారా అని సవాల్ చేశారు.

రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు కూడా కనిపించడం లేదంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టిపై ముఖ్యమంత్రి కేసీఆర్ విరుచుకుపడ్డారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు కాదా అని ప్రశ్నించారు. ఒక్క ఏడాదిలో పూర్తి చేసిన భక్త రామదాసు ప్రాజెక్టు కనబడటం లేదా అని నిలదీశారు. 2 లక్షల కోట్ల అప్పును 3 లక్షల కోట్లుగా చెప్పి ప్రజలకు అవాస్తవాలు చేరేలా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాణహిత-చేవెళ్లకు అగ్రిమెంట్ లేదని అందుకే రీడిజైన్ చేశామని తెలిపారు. అప్పులు చేయకుండా ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయని ప్రశ్నించారు. అవసరమైతే ఇంకో రూ.20 వేల కోట్ల అప్పు కూడా తెస్తామన్నారు. పరిమితులకు లోబడే అప్పులు తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు.
- ఇదీ చూడండి : 'మీరు చెప్పుడేంది... మేమే చెప్తున్నం'