తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనా భయపడేంత పెద్ద ఉత్పాతం కాదు: సీఎం

విదేశాల నుంచి వస్తున్న వారి నుంచే కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలకు ఈ వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలు చాలా తక్కువని వివరించారు. రాష్ట్రంలో కరోనా ప్రభావం లేదని స్పష్టం చేశారు. కరోనా బాధితుల కోసం వివిధ ఆస్పత్రుల్లో 1,340 పడకలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. రూ.500కోట్ల నిధిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

cm kcr
కరోనా భయపడేంత పెద్ద ఉత్పాతం కాదు: సీఎం

By

Published : Mar 14, 2020, 9:50 PM IST

Updated : Mar 14, 2020, 10:15 PM IST

మన రాష్ట్రంలో కరోనా ప్రభావం లేదని సీఎం కేసీఆర్‌ తెలిపారు. విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన బెంగళూరు వాసికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని... చికిత్స అనంతరం డిశ్చార్జ్‌ అయ్యాడని వెల్లడించారు. ఇప్పుడు చికిత్స పొందుతున్న వారిలో కరోనా అనుమానిత లక్షణాలు మాత్రమే ఉన్నాయని వివరించారు. మన దేశంలో కరోనా కారణంగా ఇప్పటివరకు ఇద్దరు మాత్రమే చనిపోయారని చెప్పారు. మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.

కరోనా భయపడేంత పెద్ద ఉత్పాతం కాదు: సీఎం

భయపడేంత పెద్ద ఉత్పాతం కాదు ఇది. నివారణ చర్యలు, ముందస్తు జాగ్రత్తలతోనే కరోనాను ఎదుర్కోవచ్చు. 135 కోట్లు ఉన్న దేశ జనాభాలో ఇప్పటి వరకు 83 మందికి మాత్రమే కరోనా సోకింది. ఇప్పటి 66 మంది భారతీయులు, 16 విదేశీయులు. కరోనాను ఎదుర్కోనేందుకు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి వచ్చిన వారికి విమానాశ్రయాల్లోనే స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నాం. మార్చి 31 వరకు అన్ని విద్యాసంస్థలు మూసివేస్తాం.

-సీఎం కేసీఆర్

Last Updated : Mar 14, 2020, 10:15 PM IST

ABOUT THE AUTHOR

...view details