రాష్ట్ర ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ కుమార్తె(padma rao goud daughter).. వివాహానికి ముఖ్యమంత్రి కేసీఆర్(cm kcr in padma rao goud daughter marriage) హాజరయ్యారు. సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్స్‌లో.. పద్మారావు కుమార్తె మౌనికగౌడ్ వివాహం(padma rao goud daughter marriage) అవినాశ్‌తో వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రితో సహా పలువురు ప్రముఖులు వివాహ వేడుకకు హాజరై.. నూతన వధువరులను ఆశీర్వదించారు.
వైభవంగా.. పద్మారావు గౌడ్ కుమార్తె వివాహం వధూవరులతో ముఖ్యమంత్ర కేసీఆర్, మంత్రులు ప్రముఖులు హాజరు..
తీగుల్ల వారి ఇంట పెళ్లితో సికింద్రాబాద్ నియోజకవర్గంలో సందడి వాతావరణం ఏర్పడింది. ప్రముఖుల రాకతో ఇంపీరియల్ గార్డెన్స్ పరిసరాలు కోలాహలంగా మారాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు శాసనశాభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, జగదీష్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు పలువులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, మాజీ మేయర్లు, కార్పొరేటర్లు, అన్ని రాజకీయ పార్టీల ముఖ్య నేతలు, నగరానికి చెందిన పలువురు ప్రముఖులు, అసెంబ్లీ కార్యదర్శి నరసింహ చార్యులుతో సహా వివిధ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
తీగుల్ల కుటుంభసభ్యులతో సీఎం ఫొటో నూతన వధూవరులను దీవిస్తోన్న మంత్రి కేటీఆర్ వధూవరులకు శుభాకాంక్షలు చెబుతోన్న మంత్రులు జగదీష్‌రెడ్డి, మహమూద్ అలీ వధూవరులను ఆశీర్వధిస్తోన్న భాజపా నేత లక్ష్మణ్ సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అడ్డగుట్ట, తార్నాక, మెట్టుగూడ, సీతాఫల్‌మండీ, బౌద్ధనగర్ డివిజన్లకు చెందిన అన్ని పార్టీల నేతలతో పాటు వేలాది సంఖ్యలో స్థానికులు వివాహానికి హాజరై నూతన వధువరులను దీవించారు. అనంతరం విందును స్వీకరించారు.
ఇదీ చూడండి: