కరోనా దృష్ట్యా రాష్ట్రంలో స్వాతంత్య్ర వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో గోల్కొండలో జరగాల్సిన వేడుకలు ప్రగతిభవన్‌కే పరిమితమయ్యాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రగతిభవన్‌లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్
74వ స్వాతంత్య్ర వేడుకలు ప్రగతిభవన్‌లో నిరాడంబరంగా జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. పంద్రాగస్టును పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ మైదానంలోని సైనిక స్మారకం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళి అర్పించారు.
ప్రగతిభవన్‌లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్
అంతకు ముందు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలోని సైనిక స్మారకం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళి అర్పించారు. స్మారకం వద్ద పుష్పాలు సమర్పించి స్వతంత్ర సమరయోధుల సేవలు గుర్తుచేసుకున్నారు.
ఇవీ చూడండి:ఎర్రకోటపై మువ్వన్నెల జెండా రెపరెపలు
Last Updated : Aug 15, 2020, 12:03 PM IST