కేంద్రంపై పోరాటానికి కేసీఆర్ పిలుపు.. పలు రాష్ట్రాల సీఎంలు, నేతలకు ఫోన్లు - CM KCR fight against Center
![కేంద్రంపై పోరాటానికి కేసీఆర్ పిలుపు.. పలు రాష్ట్రాల సీఎంలు, నేతలకు ఫోన్లు CM KCR asked the CMs and leaders of various states to come together to fight against the Centre](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15829740-733-15829740-1657868451335.jpg)
12:13 July 15
కేంద్ర వైఖరిపై సమరశంఖం పూరిద్దాం : కేసీఆర్
CM KCR fight against Center : ఈ నెల 18 నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో.. కేంద్రంపై పోరాటానికి సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. కేంద్రంపై పోరాటానికి కలసి రావాలని వివిధ రాష్ట్రాల సీఎంలు, నేతలతో ఫోన్లో సీఎం కేసీఆర్ చర్చలు జరిపారు. ఈ మేరకు.. మమతా బెనర్జీ, అర్వింద్ కేజ్రీవాల్, తేజస్వీ యాదవ్, అఖిలేశ్ యాదవ్, శరద్ పవార్‌లతో మాట్లాడారు. పార్లమెంటు వేదికగా కేంద్రప్రభుత్వంపై పోరాడదామని సీఎం కేసీఆర్ తెలిపారు.
మరోవైపు.. పార్లమెంటు సమావేశాల దృష్ట్యా రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతిభవన్‌లో ఎంపీలతో సీఎం భేటీ కానున్నారు. ఉభయసభల్లో తెరాస నేతలు అనుసరించాల్సిన విధివిధానాలపై దిశానిర్దేశం చేయనున్నారు. లోక్సభ, రాజ్యసభల్లో తెరాస ఎంపీలు అవలంభించాల్సిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని ఎంపీలకు సూచించనున్నారు. తెలంగాణపై వివక్షను ఎత్తిచూపేలా.. పార్లమెంటు వేదికగా కేంద్రప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని.. ధాన్యం కొనుగోళ్లపైనా పోరాడాలని ఎంపీలకు మార్గనిర్దేశం చేయనున్నారు.