తెలంగాణ

telangana

ETV Bharat / city

LIVE UPDATES: హనుమకొండకు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ - వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం కేసీఆర్​ ఏరియల్​ సర్వే

CM KCR
CM KCR

By

Published : Jul 17, 2022, 7:43 AM IST

Updated : Jul 17, 2022, 8:51 PM IST

20:50 July 17

రేపు కూడా వరద ప్రాంతాల పరిశీలనకు వెళ్లనున్న సీఎం

  • హనుమకొండకు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌
  • ఏటూరునాగారం నుంచి హనుమకొండకు చేరుకున్న సీఎం
  • ఇవాళ రాత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో సీఎం రాత్రి బస
  • రేపు కూడా వరద ప్రాంతాల పరిశీలనకు వెళ్లనున్న సీఎం

18:24 July 17

  • ఏటూరునాగారంలో ముగిసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష
  • ఏటూరునాగారం నుంచి వరంగల్‌ బయల్దేరిన సీఎం కేసీఆర్

16:41 July 17

  • ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ సమీక్ష
  • వరదలు రాకుండా శాశ్వత ప్రణాళికలపై సమావేశంలో చర్చ

15:54 July 17

వరద బాధితులను పరామర్శిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌

  • హెలికాప్టర్‌లో ఏటూరునాగారం చేరుకున్న సీఎం కేసీఆర్‌
  • గోదావరి వరద ప్రాంతాల్లో సీఎం కేసీఆర్‌ విహంగ వీక్షణం
  • నదికి ఇరువైపులా వరదలో చిక్కుకున్న గ్రామాల పరిశీలన
  • రామన్నగూడెం కరకట్ట వద్ద పునరావాస కేంద్రానికి వెళ్లిన సీఎం కేసీఆర్‌
  • వరద బాధితులను పరామర్శిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌
  • గోదావరి తల్లి శాంతించాలంటూ పూజలు చేసిన సీఎం కేసీఆర్‌

14:27 July 17

ఏటూరునాగారం వెళ్లిన సీఎం కేసీఆర్‌

  • భద్రాచలం నుంచి హెలికాప్టర్‌లో ఏటూరునాగారం వెళ్లిన సీఎం కేసీఆర్‌
  • గోదావరి వరద ప్రాంతాల్లో సీఎం కేసీఆర్‌ విహంగ వీక్షణం
  • నదికి ఇరువైపులా వరదలో చిక్కుకున్న గ్రామాల పరిశీలన
  • అనంతరం కరకట్ట వద్ద పునరావాస కేంద్రానికి వెళ్లనున్న సీఎం
  • వరద బాధితులను పరామర్శించనున్న సీఎం కేసీఆర్‌
  • మారుమూల ప్రాంతాల్లో వరదల పరిస్థితిపై ఫొటో ఎగ్జిబిషన్‌
  • ఫొటో ఎగ్జిబిషన్ పరిశీలించనున్న సీఎం కేసీఆర్‌

13:43 July 17

ఏటూరునాగారం చేరుకున్న సీఎం కేసీఆర్.. గోదావరికి శాంతి పూజలు..!

  • ఏటూరునాగారం చేరుకున్న సీఎం కేసీఆర్
  • సీఎంకు స్వాగతం పలికిన మంత్రి సత్యవతి, స్థానిక నేతలు
  • రామన్నగూడెం దగ్గర గోదావరికి శాంతి పూజలు చేయనున్న సీఎం
  • ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించనున్న సీఎం
  • వరద బాధితులను పరామర్శించనున్న సీఎం
  • ఐటీడీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షలో పాల్గొననున్న సీఎం

13:12 July 17

సీఎంను కలవనివ్వలేదంటూ పునరావాస శిబిరం వద్ద ఆందోళన

  • భద్రాద్రి: అశ్వాపురం మం. మొండికుంట పునరావాస శిబిరం వద్ద ఆందోళన
  • సీఎంను కలిసే అవకాశం ఇవ్వలేదంటూ నిర్వాసితుల ఆందోళన
  • భద్రాద్రి: పునరావాస శిబిరానికి సీఎం వస్తారని తెలిపిన అధికారులు
  • సీఎం కేసీఆర్‌కు గోడు చెప్పుకోవాలని భావించిన బాధితులు
  • సీఎంను కలిసే అవకాశం ఇవ్వలేదని బాధితుల ఆవేదన
  • నిరసనగా పునరావాస కేంద్రాన్ని ఖాళీ చేసిన వరద బాధితులు
  • శిబిరం నుంచి 10 కి.మీ దూరంలోని స్వగ్రామానికి వెళ్తున్న బాధితులు
  • మొండికుంట శిబిరం నుంచి చింపిర్యాలకు వెళ్తున్న బాధితులు
  • అధికారులు వారించినా ఆవేదనతో స్వగ్రామానికి వెళ్తున్న బాధితులు
  • సీఎంను కలవనీయకుండా నిర్బంధించారని బాధితుల ఆరోపణ
  • పోలీసులు మెడలు పట్టి లోనికి తోసి నిర్బంధించారని బాధితుల ఆవేదన

13:09 July 17

భద్రాచలం నుంచి హెలికాప్టర్‌లో ఏటూరునాగారం బయలుదేరిన కేసీఆర్

  • భద్రాచలం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరిన సీఎం కేసీఆర్‌
  • హెలికాప్టర్‌లో ఏటూరునాగారం బయలుదేరిన సీఎం కేసీఆర్
  • వరద ప్రాంతాల్లో సీఎం కేసీఆర్‌ విహంగ వీక్షణం

12:55 July 17

'గోదావరి పరివాహక ప్రాంతంపై క్లౌడ్‌ బరస్ట్‌ చేస్తున్నారు'..!

  • క్లౌడ్‌ బరస్ట్‌పై సీఎం కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
  • క్లౌడ్‌ బరస్ట్‌ అనే కొత్త పద్ధతి వచ్చింది: సీఎం కేసీఆర్‌
  • క్లౌడ్‌ బరస్ట్‌పై ఏదో కొన్ని కుట్రలు ఉన్నట్లు చెబుతున్నారు: సీఎం
  • కుట్రలు ఎంతవరకు నిజమో తెలియదు: సీఎం కేసీఆర్‌
  • ఇతర దేశాలవాళ్లు కావాలని అక్కడక్కడ క్లౌడ్‌ బరస్ట్ చేస్తున్నారు: సీఎం
  • గతంలో లద్దాఖ్‌, లేహ్‌, ఉత్తరాఖండ్‌లో క్లౌడ్‌ బరస్ట్‌ చేశారు: సీఎం
  • గోదావరి పరివాహక ప్రాంతంపై క్లౌడ్‌ బరస్ట్‌ చేస్తున్నట్లు సమాచారం: సీఎం
  • వాతావరణ మార్పుల వల్ల ఉత్పాతాలు వస్తుంటాయి: సీఎం

12:43 July 17

భద్రాచలం ఆలయ అభివృద్ధికి కృషిచేస్తా: సీఎం కేసీఆర్‌

  • భద్రాచలం ఆలయ అభివృద్ధికి కృషిచేస్తా: సీఎం కేసీఆర్‌
  • ఆలయ అభివృద్ధిపై తదుపరి పర్యటనలో పర్యవేక్షిస్తా: సీఎం
  • నెలాఖరు వరకు భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలి: సీఎం
  • వరద బాధితులకు పునరావాస కేంద్రాలు కొనసాగించాలి: సీఎం
  • వరద పరిస్థితులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాం: సీఎం
  • గోదావరికి ముప్పు తప్పేలా చర్యలు చేపడతాం: సీఎం

12:40 July 17

వరద ఇబ్బందులు లేకుండా రూ.1,000 కోట్లు..!

  • వరద సమస్యలకు శాశ్వత పరిష్కారం జరగాలి
  • భద్రాచలం, పినపాకలో వరద ఇబ్బందులు లేకుండా చర్యలు
  • సింగరేణి, ప్రభుత్వం కలిసి రూ.వెయ్యి కోట్లు మంజూరుకు చర్యలు
  • గోదావరికి 90 అడుగుల మేర వరద వచ్చినా ఇబ్బంది లేకుండా చర్యలు
  • ఎత్తైన ప్రాంతంలో కాలనీ నిర్మాణానికి సీఎస్‌ చర్యలు చేపడతారు
  • వరద పరిస్థితుల ముప్పు తర్వాత ఉన్నతాధికారులు పర్యటిస్తారు

12:38 July 17

వరద బాధితులకు తక్షణమే రూ.10 వేలు ఆర్థికసాయం, 20 కిలోల చొప్పున బియ్యం

  • దేవుడి దయ వల్ల ఎలాంటి ప్రాణహాని జరగలేదు
  • రెండు జిల్లాల యంత్రాంగం ప్రాణ నష్టం జరగకుండా చూసింది
  • వరద సమస్యకు శాశ్వత పరిష్కారం జరగాలి
  • కడెం ప్రాజెక్టు వద్ద ఊహించనంత వరద వచ్చింది
  • వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు
  • మొత్తం 7,274 కుటుంబాలను అధికారులు తరలించారు
  • వాతావరణశాఖ ప్రకారం ఈ నెల 29 వరకు వర్షాలు ఉంటాయి
  • బాధిత కుటుంబాలకు తక్షణమే రూ.10 వేలు ఆర్థిక సాయం
  • బాధిత కుటుంబాలకు 20 కిలోల చొప్పున బియ్యం పంపిణీ

12:27 July 17

దేవుడి దయ వల్ల ఎలాంటి ప్రాణహాని జరగలేదు

  • దేవుడి దయ వల్ల ఎలాంటి ప్రాణహాని జరగలేదు
  • రెండు జిల్లాల యంత్రాంగం ప్రాణ నష్టం జరగకుండా చూసింది
  • వరద సమస్యకు శాశ్వత పరిష్కారం జరగాలి
  • కడెం ప్రాజెక్టు వద్ద ఊహించనంత వరద వచ్చింది
  • వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు
  • మొత్తం 7,274 కుటుంబాలను అధికారులు తరలించారు

11:11 July 17

భద్రాచలంలో గోదారమ్మకు శాంతి పూజలు చేసిన సీఎం కేసీఆర్

భద్రాచలంలో గోదారమ్మకు శాంతి పూజలు చేసిన సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ భద్రాచలం చేరుకున్నారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నదీ ప్రవాహాన్ని, పరిసర ప్రాంతాలను గోదావరి బ్రిడ్జి మీద నుంచి సీఎం కేసీఆర్ పర్యవేక్షించారు. అనంతరం ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నదికి ముఖ్యమంత్రి శాంతి పూజ నిర్వహించారు. అనంతరం గోదావరి వరద తాకిడికి గురైన కరకట్టను సీఎం పరిశీలిస్తారు. అక్కడ నుంచి వరద ముంపు బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి చేరుకుంటారు. వరద బాధితులను పరామర్శిస్తారు. పునరావాస కేంద్రంలో వరద బాధితులకు అందుతున్న వైద్యం, తదితర సహాయ కార్యక్రమాలను తెలుసుకుని వారికి భరోసానిస్తారు.

ఆ తర్వాత వరద పరిస్థితికి సంబంధించి ఇప్పటికే స్థానికంగా చేపట్టిన సహాయ కార్యక్రమాలపై, చేపట్టాల్సిన మరిన్ని కార్యక్రమాలపై మంత్రులు పువ్వాడ అజయ్, హరీశ్ రావు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.

09:33 July 17

కాసేపట్లో భద్రాచలం చేరుకోనున్న సీఎం.. ముంపు ప్రాంతాల పరిశీలన

భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నది వరద ముంపు పరిస్థితులు, ప్రజల కష్టనష్టాలు తెలుసుకుని తగిన సహాయ కార్యక్రమాలు అందించేందుకు నిన్న వరంగల్ చేరుకున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. ఆదివారం ఉదయం భద్రాచలం పర్యటనకు బయలుదేరారు. వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం అనుకూలించక హెలికాప్టర్​లో ఏరియల్ సర్వేను అధికారులు రద్దు చేశారు. ఈ నేపథ్యంలో బాధిత ప్రజలను చేరుకోవడానికి సీఎం కేసీఆర్.. రోడ్డుమార్గాన్ని ఎంచుకున్నారు. ములుగు, ఏటూరునాగారం మీదుగా వరద పరిస్థితులను వీక్షిస్తూ.. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను అడిగి తెలుసుకుంటూ భారీ వర్షంలోనే ప్రయాణం సాగించారు. మరికాసేపట్లో సీఎం కేసీఆర్​తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారుల బృందం భద్రాచలానికి చేరుకోనున్నారు. అక్కడ ముంపునకు గురైన ప్రాంతాలను సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు.

06:35 July 17

హనుమకొండ నుంచి ఏటూరునాగారం బయలుదేరిన సీఎం కేసీఆర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్ హనుమకొండ నుంచి ములుగు జిల్లా ఏటూరు నాగారం బయలుదేరారు. రాత్రి మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు నివాసంలో బస చేసిన సీఎం.. ఈరోజు ఉదయం రోడ్డుమార్గాన బస్సులో ఏటూరు నాగారం వెళ్లారు. అయితే హెలికాప్టర్ ద్వారా కేసీఆర్​ ఏటూరునాగారం వెళ్లాల్సి ఉండగా.. వాతవారణం అనుకూలించకపోవడంతో రోడ్డుమార్గాన బయలుదేరారు.

గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలు, వరదల వల్ల ఉదృతంగా ప్రవహిస్తున్న గోదావరి ప్రవాహక ప్రాంతాన్ని స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అనంతరం వరద నష్టాలపై సమీక్ష జరపనున్నారు. సమీక్ష అనంతరం అక్కడి నుంచి భద్రాచలం వెళ్లనున్నారు.

Last Updated : Jul 17, 2022, 8:51 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details