మార్కెట్‌లో డిమాండ్ ఉన్న, నాణ్యమైన పంటలు పండించి మంచి ధర పొందాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఏ పంట వేస్తే లాభసాటి ఉంటుందో వ్యవసాయ వర్సిటీ తగు సూచనలు చేస్తుందని.. రాష్ట్రంలోని విభిన్న పరిస్థితులను సద్వినియోగం చేసుకుని లాభాలు పొందాలని సూచించారు. నియంత్రిత సాగు విధాన ఖరారు కోసం ప్రగతి భవన్లో సుదీర్ఘంగా సమావేశం నిర్వహించి... సాగు విధానంపై పలు సూచనలు చేశారు.
రైతులు నియంత్రిత పద్ధతిలో సాగుకు ముందుకు రావాలి: సీఎం - undefined
రైతులు నియంత్రిత పద్ధతిలో పంటల సాగుకు ముందుకు రావాలని సీఎం కేసీఆర్ సూచించారు. రైతులంతా వందకు వంద శాతం రైతుబంధు సాయం పొందాలని పేర్కొన్నారు. రైతులు పండించిన పంటకు మంచి ధర పొందాలన్నదే తన అభిమతమని స్పష్టం చేశారు.
cm kcr
రాష్ట్ర రైతులు ప్రపంచంతో పోటీ పడాలని ముఖ్యమంత్రి ఆశించారు. రైతులంతా ఒకే పంట వేయడం వల్ల డిమాండ్ తగ్గి నష్టాలపాలయ్యే అవకాశాలున్నాయని... డిమాండ్ మేరకే పంటలు సాగు చేయాలని సూచిస్తున్నామన్నారు.
Last Updated : May 21, 2020, 10:09 PM IST
TAGGED:
cm kcr