తెలంగాణ

telangana

ETV Bharat / city

ys jagan: రెండేళ్ల పాలనలో ప్రజలకు ఏం చేశారో వివరిస్తూ నేడు ప్రకటన - ys jagan latest news

ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజలకు చేసిన పనులను వివరిస్తూ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. వైకాపా సర్కార్ రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో సీఎం జగన్ ప్రత్యేక పుస్తకాన్ని ఇవాళ విడుదల చేయనున్నారు. ఈ మేరకు వివిధ అంశాలతో కూడిన పుస్తకాన్ని ప్రజలకు అందించనున్నారు.

ఏపీ ముఖ్యమంత్రి జగన్
ys jagan

By

Published : May 30, 2021, 6:24 AM IST

ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్​ జగన్ రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా పుస్తకం ఆవిష్కరించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పుస్తకం విడుదల చేయనున్నారు. రెండేళ్ల పాలనపై వైకాపా సర్కార్ చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి అంశాలతో కూడిన పుస్తకాన్ని ప్రజలకు నివేదించనున్నారు.

రూ.లక్షా 31 వేల కోట్ల మేర లబ్ధి..

వైకాపా రెండేళ్ల పాలనలో ప్రజలకు లక్షా 31 వేల రూపాయల కోట్ల మేర ప్రయోజనం కల్పించినట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇవాళ్టితో వైకాపా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైన సందర్భంగా.. ప్రజలకు ఏం చేశారో వివరిస్తూ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.

ప్రకటన విడుదల..

రెండేళ్ల పాలనా కాలంలో రాష్ట్ర ప్రజలకు లక్షా 31వేల 725.55 కోట్ల రూపాయల ప్రయోజనం కల్పించినట్లు తెలిపింది. అందులో ప్రజల ఖాతాల్లో నేరుగా 95 వేల 528.5 కోట్లు జమకాగా.. పరోక్షంగా 36 వేల 197.05 కోట్లు అందించినట్లు ప్రకటించింది. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన 129 వాగ్దానాల్లో.....107అమలు చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. 15 హామీలు వివిధ దశల్లో ఉన్నాయని, మరో 7 అమలు చేయాల్సి ఉందని తెలిపింది. అదనంగా మరో 50 పథకాల ద్వారా ప్రయోజనం కల్పించినట్లు వివరించింది.

ఒక కోటి 41 లక్షల 52 వేల కుటుంబీకులకు..

1,41,52,386 కుటుంబాలకు ఈ పథకాల ద్వారా ప్రయోజనం కలిగినట్లు వెల్లడించింది. 18 శాతం కుటుంబాలకు ఒక పథకం, 82 శాతం కుటుంబాలు రెండు, అంతకన్నా ఎక్కువ లబ్ధి పొందినట్లు తెలిపింది. బీసీలకు 46 వేల 405.81 కోట్లు, ఎస్సీలకు 15 వేల 304.57 కోట్లు, ఎస్టీలకు 4వేల 915.86 కోట్లు, మైనార్టీలకు 3వేల 374.23 కోట్లు, కాపులకు 7వేల 368.2 కోట్లు, ఇతరులకు 18 వేల 246.83 కోట్లు నేరుగా ఖాతాల్లో జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

18 దిశ,700 ఠాణాలకు హెల్ప్ డెస్క్​లు..

ప్రత్యక్షంగా, పరోక్షంగా మహిళలకు 88 వేల మందికి రూ.40.29 కోట్ల మేర ప్రయోజనం కల్పించామని పేర్కొంది. 18 దిశ పోలీస్‌స్టేషన్లు, 700 ఠాణాల్లో మహిళా సహాయ డెస్క్‌లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.

3 రాజధానులు..

పాలన వికేంద్రీకరణలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ఏర్పాటుచేసి.. 541 సేవలు అందిస్తున్నట్లు వైకాపా ప్రభుత్వం పేర్కొంది. 3 రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపింది. గ్రామ సచివాలయంలో 11మంది, వార్డు సచివాలయంలో 10 మంది ఉద్యోగుల చొప్పున మొత్తం లక్షా 30 వేల మందిని నియమించామని తెలిపింది. 2.61 లక్షల మందితో వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. పోలవరంతోపాటు సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఏడు శాఖల్లో రివర్స్‌ టెండర్లు నిర్వహించి 5వేల రూ.70.43 కోట్లు ఆదా చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

ఇవీ చూడండి :ఈసారీ కరోనా మధ్యే మోదీ 2.0 వార్షికోత్సవం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details