తెలంగాణ

telangana

ETV Bharat / city

చదువుతో పేదరికాన్ని గెలవచ్చు : ఏపీ సీఎం జగన్ - చదువుతో లోకాన్ని గెలవచ్చు : ఏపీ సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్​లో జగనన్న విద్యా కానుక పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ కృష్ణా జిల్లా పునాదిపాడులోని.. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందని ఏపీ సీఎం అన్నారు. ప్రపంచాన్ని మార్చే శక్తి విద్యకే ఉందన్న జగన్.. ప్రపంచంతో పోటీపడే పరిస్థితి మన పిల్లల్లో రావాలని ఆకాంక్షించారు.

cm jagan vidhya kanika scheme in ap
చదువుతో పేదరికాన్ని గెలవచ్చు : ఏపీ సీఎం జగన్

By

Published : Oct 8, 2020, 2:13 PM IST

చదువుతో పేదరికాన్ని గెలవచ్చు : ఏపీ సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్​లోని విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. మనబడి, నాడు-నేడు వంటి కార్యక్రమాలతోో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నామన్న సీఎం.. నవంబర్‌ 2న పాఠశాలలు తిరిగి ప్రారంభించాలనుకుంటున్నట్టు తెలిపారు.

కుటుంబ ఆర్థిక పరిస్థితులు మారినప్పుడే పిల్లల పరిస్థితి మారుతుందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. విద్యా వ్యవస్థను సమూలంగా మార్చేందుకు పలు కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ప్రతి పేదవాడికి ఆంగ్ల మాధ్యమం అందించేందుకు అడుగులు ముందుకు వేశామన్నారు. పేద పిల్లలు గర్వంగా తలెత్తుకొని పాఠశాలకు వెళ్లాలని అన్నారు. చదువుతో పేదరికాన్ని గెలవొచ్చన్న సీఎం జగన్.. పేదల తలరాత మార్చేందుకు విద్యాశాఖలో 8 ప్రధాన పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు.

ఇదీ చదవండి:'జగనన్న విద్యా కానుక' పథకం ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్

ABOUT THE AUTHOR

...view details