ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపిన నేపథ్యంలో.. ఎలా ముందుకెళ్లాలనే అంశంపై ముఖ్య నేతలు, అధికారులతో ఏపీ సీఎం జగన్ అత్యవసర సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో.. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో పాటు అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ పాల్గొన్నారు. విచారణ సందర్భంగా కోర్టు వెల్లడించిన అభిప్రాయాలు, తీర్పుపై చర్చించారు.
పంచాయతీ ఎన్నికలపై ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం - సీఎం జగన్ తాజా వార్తలు
పంచాయతీ ఎన్నికలపై.. సుప్రీం చేసిన వ్యాఖ్యలు, తీర్పుపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ మంత్రులు, అధికారులపై చర్చించారు. ఎస్‌ఈసీకి సహకరించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు.
పంచాయతీ ఎన్నికలపై ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం
ఎన్నికల సంఘానికి సహకారం అందించాలా?... వద్దా?.. అనే అంశంపై అభిప్రాయాలు సేకరించారు. అనంతరం పంచాయతీ ఎన్నికల్లో ఎస్‌ఈసీకి సహకరించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు.
ఇవీచూడండి:'ఎన్నికలు జరగాల్సిందే... మీ యుద్ధంలో మేం భాగస్వామ్యం కాబోము'