ఏపీ వరద ప్రభావిత జిల్లాల్లో ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ పర్యటించారు. కడప జిల్లా రాజంపేట మండలంలో జగన్ పర్యటన కొనసాగుతోంది. పులపుత్తూరు గ్రామంలో తిరుగుతూ బాధితులను పరామర్శించారు. సర్వం కోల్పోయామని..ఆదుకోవాలని బాధితులు జగన్‌కు మొర పెట్టుకున్నారు. ఇళ్లు కోల్పోయిన వరద బాధితులతో సీఎం మాట్లాడారు. కొత్త ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు.
cm jagan tour: 'ఇళ్లు కోల్పోయినవారికి కొత్తవి కట్టిస్తాం' - ఏపీ సీఎం కడప పర్యటన
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. కడప జిల్లా పులపుత్తూరులో కాలినడకన తిరుగుతూ వరద బాధితులను పరామర్శిస్తున్నారు.
cm jagan tour
వరదల కారణంగా డ్వాక్రా డబ్బులు చెల్లించలేమని మహిళలు సీఎంకు తెలపగా.. ఏడాదిపాటు మారటోరియం విధిస్తామని సీఎం హమీ ఇచ్చారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను సీఎం పరిశీలించారు. వరద ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం ఎన్ఆర్పల్లిలోని జవహర్ నవోదయ విద్యాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి:'యువతకు ఉద్యోగాల్లేవు.. ఇంకెంత కాలం ఓపిగ్గా ఉండాలి?'