తెలంగాణ

telangana

ETV Bharat / city

CM Jagan to visit Delhi: రేపు దిల్లీకి ఏపీ సీఎం జగన్‌.. ప్రధానితో భేటీ - రేపు దిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి జగన్‌

CM Jagan to visit Delhi: ఏపీ ముఖ్యమంత్రి జగన్​.. రేపు దిల్లీ వెళ్లనున్నారు. మంగళవారం సాయంత్రం ప్రధాని మోదీతో జగన్​ భేటీ కానున్నారు. కొత్త జిల్లాలు, రాష్ట్రానికి నిధుల కేటాయింపు, పోలవరం సహా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్​ అంశాలపై చర్చించనున్నారు.

CM Jagan to visit Delhi
రేపు దిల్లీకి సీఎం జగన్‌

By

Published : Apr 4, 2022, 1:47 PM IST

CM Jagan to visit Delhi: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్​ రెడ్డి మంగళవారం దిల్లీ వెళ్లనున్నారు. రేపు సాయంత్రం 4 గంటల 30 నిమిషాల సమయంలో ప్రధాని నరేంద్రమోదీతో .. జగన్‌ భేటీ కానున్నారు. కొత్త జిల్లాలు, రాష్ట్రానికి నిధుల విషయంపై ప్రధానితో చర్చించనున్నారు. పోలవరం సహా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపైనా మాట్లాడనున్నారు. అంశాలపై ప్రధానికి విజ్ఞాపనలు అందజేయనున్నారు. ప్రధానితో భేటీ తర్వాత.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో సమావేశం కోసం సీఎం జగన్‌ అపాయింట్‌మెంట్‌ కోరారు.

ABOUT THE AUTHOR

...view details