తెలంగాణ

telangana

ETV Bharat / city

YSR EBC Nestham scheme: నేడు 'వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం' నిధులు జమ - telangana news

YSR EBC Nestham scheme: వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకాన్ని.. ఏపీ సీఎం జగన్‌ మంగళవారం ప్రారంభించనున్నారు. ఏపీలోని 3.92 లక్షల మందికి లబ్ధిదారులకు.. రూ.589 కోట్లు విడుదల చేయనున్నారు.

YSR EBC Nestham scheme, ap cm jagan
నేడు 'వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం' నిధులు జమ

By

Published : Jan 25, 2022, 11:42 AM IST

YSR EBC Nestham scheme: అగ్రవర్ణ మహిళలకు మెరుగైన జీవనోపాధి, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకాన్ని నేడు ఆ రాష్ట్ర సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు. వర్చువల్‌గా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఏపీలోని 3.92 లక్షల మందికి లబ్ధిదారులకు రూ.589 కోట్లు విడుదల చేయనున్నారు.

కంప్యూటర్‌ బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జగన్‌ ఈ మొత్తాన్ని జమ చేయనున్నారు. ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.15వేల చొప్పున మూడేళ్లలో రూ.45 వేలు సాయం చేయనున్నారు. 45 నుంచి 60 ఏళ్లలోపు పేద అగ్రవర్ణ మహిళలు ఈ పథకానికి అర్హులు. బ్రాహ్మణ, క్షత్రియ, రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, వెలమ, ఇతర మహిళలకు ఈబీసీ నేస్తం కింద ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనుంది.

ఇదీ చదవండి:'భాగ్యనగర శివార్లలో మౌలిక వసతులు పెంచుతున్నాం'

ABOUT THE AUTHOR

...view details