తెలంగాణ

telangana

ETV Bharat / city

CM Jagan Tirupati Tour : నేడు తిరుపతిలో ఏపీ సీఎం జగన్ పర్యటన​ - నేడు తిరుపతిలో సీఎం జగన్ పర్యటన​

CM Jagan Tirupati Tour: ఏపీ ముఖ్యమంత్రి జగన్.. నేడు తిరుపతిలో పర్యటించనున్నారు. ఉదయం తిరుపతి ఎస్వీ వెటర్నరీ కళాశాల మైదానంలో నిర్వహించే విద్యాదీవెన బహిరంగసభలో పాల్గొంటారు.

CM Jagan Tirupati Tour
తిరుపతిలో సీఎం జగన్​ పర్యటన

By

Published : May 5, 2022, 9:56 AM IST

CM Jagan Tirupati Tour: ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్ నేడు తిరుపతిలో పర్యటించనున్నారు. ఉదయం 10:45 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్న సీఎం.. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయ మైదానానికి వెళ్తారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఎస్వీయూ తారకరామ మైదానానికి చేరుకొని అక్కడ విద్యాదీవెన బహిరంగసభలో పాల్గొంటారు. విద్యార్థులతో వారి తల్లులతో ముఖాముఖి నిర్వహించి సభనుద్దేశించి ప్రసంగిస్తారు.

జగనన్న విద్యా దీవెన తొలి త్రైమాసిక నిధులను మీట నొక్కి విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలకు జమ చేస్తారు. అనంతరం అలిపిరి వద్ద 6 ఎకరాల స్థలంలో రూ. 300 కోట్లతో తితిదే నిర్మించనునన్న శ్రీపద్మావతి చిన్నపిల్లల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం బ‌ర్డ్‌ ఆస్పత్రిలో గ్రహణ మొర్రి, చెవుడు, మూగ వార్డులును ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం శ్రీ వేంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్​ కేర్, రీసెర్చ్ ఆస్పత్రిని సీఎం ప్రారంభించనున్నారు. స్మార్ట్‌సిటీ కార్పొరేషన్, తితిదే సంయుక్తంగా నిర్మించిన శ్రీనివాససేతు మొద‌టి ద‌శ‌ పనులను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఆ తర్వాత తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి తిరిగి వెళ్లనున్నారు.

ABOUT THE AUTHOR

...view details