తెలంగాణ

telangana

ETV Bharat / city

CM JAGAN SHIMLA TOUR: సీఎం జగన్​ సిమ్లా టూర్.. నెలాఖరు వరకు అక్కడే..! - ఏపీ తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్ తన కుటుంబసభ్యులతో కలిసి సిమ్లా పర్యటనకు బయల్దేరారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా అక్కడ ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సీఎం సందర్శించనున్నారు.

cm jagan shimla tour
సీఎం జగన్​

By

Published : Aug 28, 2021, 12:32 PM IST

ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే ఏపీ సీఎం జగన్​ మోహన్​ రెడ్డి.. కుటుంబ సభ్యులతో కలిసి కాస్త సమయం సరదాగా గడపనున్నారు. జగన్​.. తన కుటుంబ సభ్యులతో కలిసి సిమ్లా టూర్​కు వెళ్లారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి తన కుటుంబంతో కలిసి చండీగఢ్, అక్కడి నుంచి సిమ్లా వెళ్లనున్నారు. సిమ్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను ఆయన సందర్శించనున్నారు. సీపీ బత్తిన శ్రీనివాస్, డీసీపీ హర్షవర్ధన్, ముఖ్యమంత్రి ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, తదితరులు పర్యటన ఏర్పాట్లు పర్యవేక్షించారు.

సీఎం జగన్​ వివాహం జరిగి ఆగస్టు 28కి 25 ఏళ్లు. ఈ సందర్భంగా సీఎం తన కుటుంబసభ్యులతో కలిసి ఈ టూర్ వెళ్తున్నారని సమాచారం. ఆగస్టు 26 నుంచి 31 వరకు ఆయన కుటుంబంతో అక్కడే గడపనున్నారు. సెప్టెంబరు 1న జగన్​ ఏపీకి తిరుగు పయనమవుతారు.

ఇదీ చదవండి:RGUKT: ప్రతికూల పరిస్థితుల్లో ఆర్జీయూకేటీ ప్రతిభ.. ప్రముఖ కంపెనీల మొగ్గు!

ABOUT THE AUTHOR

...view details