తెలంగాణ

telangana

ETV Bharat / city

cm jagan: నకిలీ చలానాల కుంభకోణంపై సీఎం జగన్​ కీలక ఆదేశాలు - నకిలీ చలానాల కుంభకోణం తాజా వార్తలు

ఏపీలో వెలుగుచూసిన నకిలీ చలానాల కుంభకోణంపై ముఖ్యమంత్రి జగన్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. నగదు రికవరీ చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు నకిలీ చలానాల ద్వారా దాదాపు ఐదున్నర కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్టు ఏపీ ప్రభుత్వం గుర్తించింది.

ap cm jagan
ap cm jagan

By

Published : Aug 13, 2021, 4:59 PM IST

ఏపీలో నకిలీ చలానాల కుంభకోణంపై ప్రభుత్వం అంతర్గత విచారణ ముమ్మరం చేసింది. రిజిస్ట్రేషన్ శాఖ, డీఐజీల ఫిర్యాదు మేరకు జిల్లాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఏడాది క్రితం నుంచి జరిగిన రిజిస్ట్రేషన్ లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు నకిలీ చలానాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు ఐదున్నర కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్టు గుర్తించారు. మొత్తం రూ.10 కోట్ల వరకు అవకతవకలు జరిగి ఉండొచ్చని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ అంచనా వేస్తోంది.

ఈ వ్యవహారానికి సంబంధించి ఏపీవ్యాప్తంగా ఐదుగురు సబ్ రిజిస్ట్రార్‌లను సస్పెండ్ చేశారు. మంగళగిరి, విజయవాడలోని పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ నకిలీ చలానాల వ్యవహారంలో తనిఖీలు జరుగుతున్నాయి. డాక్యుమెంట్ రైటర్లతో కుమ్మక్కై కొందరు సబ్ రిజిస్ట్రార్​లే ఈ అవకతవకలకు పాల్పడుతున్నట్టుగా ప్రాథమిక విచారణలో తేలింది. మరోవైపు ఈ చలానాను ఆస్తుల రిజిస్ట్రేషన్​కు జతపరిచేలా సాఫ్ట్​వేర్​లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. దీనిపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశించనున్నట్టు తెలుస్తోంది.

లొసుగులతోనే మోసం: డీఐజీ

గుంటూరు జిల్లాలో నకిలీ చలానాల వ్యవహారంపై రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ శ్రీనివాసరావు స్పందించారు. సాఫ్ట్​వేర్​లో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకొని.. కొందరు ఇలాంటి అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. జిల్లా వ్యాప్తంగా 35 రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రికార్డులు తనిఖీలు చేశామని.. కేవలం మంగళగిరి రిజిస్ట్రార్ కార్యాలయంలో మాత్రమే అక్రమాలు జరిగినట్లు తేలిందని వివరించారు. అక్కడ.. 7 రిజిస్ట్రేషన్లకు సంబంధించి రూ. 7 లక్షల 95 వేల విలువైన నకిలీ చలానాలు జతచేసినట్లు విచారణలో వెల్లడైందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో 7 కేసులు నమోదు చేసినట్లు వివరించారు.

మరోవైపు.. పాత సాఫ్ట్​వేర్​ స్థానంలో.. కొత్తది సోమవారం నుంచి వినియోగంలోకి రానుందని తెలిపారు. దీంతో ఎలాంటి అక్రమాలు జరగకుండా అరికట్టవచ్చన్నారు.

సీఎం జగన్​ ఆగ్రహం..

నకిలీ చలానాల కుంభకోణంపై ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులతో ఫోన్​లో మాట్లాడిన ముఖ్యమంత్రి.. కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నిందితుల నుంచి సొమ్ము రికవరీపైనా దృష్టి పెట్టాలన్నారు.

ఇప్పటికే రూ.40 లక్షల మేర సొమ్ము రికవరీ చేసినట్లు సీఎంకు అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్ల సాఫ్ట్‌వేర్‌లో మార్పులు.. సాఫ్ట్‌వేర్‌ను ఎన్ఐసీ, సీఎఫ్ఎంఎస్‌లకు అనుసంధానిస్తున్నట్లు సీఎంకు వివరించారు.

ఇదీచూడండి:VIJAYASAI BAIL: 'విజయసాయిరెడ్డి బెయిల్​ రద్దుపై నిర్ణయం మీదే'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details