Cm Jagan Review On Floods: వరద ప్రాంతాల్లో సహాయ చర్యలపై నాలుగు జిల్లాలో కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. సహాయ చర్యలు, పరిహారం వివరాలను సీఎం జగన్కు.. కలెక్టర్ వివరించారు. పంట నష్టంపై ఎన్యుమరేషన్ తర్వాత సోషల్ ఆడిట్ నిర్వహించాలని జగన్ ఆదేశించారు. ఇల్లు పూర్తిగా ధ్వంసమైన వారికి.. కొత్త ఇళ్లు మంజూరు చేయాలని స్పష్టం చేశారు. ఇళ్ల పనులు వెంటనే మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వారికి రూ.2 వేలు ఇవ్వండి..
చెరువులకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. చెరువుల మధ్య అనుసంధానం ఉండేలా చూడాలన్నారు. చెరువులు నిండితే ఆ నీరు కాల్వలకు వెళ్లేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వరద ప్రాంతాల్లో తాగునీటి పునరుద్ధరణపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. నిత్యావసరాలు ఇచ్చిన ప్రతి ఇంటికీ రూ.2 వేలు అందించాలన్నారు. ఆర్‌బీకేల ద్వారా విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు చేశామని సీఎం జగన్ తెలిపారు.