ఏపీలో తుపాను ప్రభావిత జిల్లాల(విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం) కలెక్టర్లతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. యాస్ తుపాను దృష్ట్యా ముందస్తు చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వాతావరణ శాఖ నివేదికలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
'యాస్ తుపాను ప్రభావిత జిల్లాలు అప్రమత్తంగా ఉండాలి' - ap cm jagan latest news
యాస్ తుపాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. తుపాను దృష్ట్యా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
ఏపీ సీఎం, ఏపీ సీఎం జగన్, యాస్ తుపాన్
శ్రీకాకుళం జిల్లా నుంచి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. జిల్లాలో అక్కడక్కడా జల్లులు తప్ప పెద్దగా ప్రభావం కన్పించలేదని తెలిపారు. తాత్కాలిక నిర్మాణాల్లో కొవిడ్ రోగులు లేకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు. ఆక్సిజన్ కొరత రాకుండా జనరేటర్లు, డీజిల్ అన్నీ సిద్ధంగా ఉన్నాయని ఏపీ ముఖ్యమంత్రికి చెప్పారు.