ఐటీ పాలసీ, ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్స్, డిజిటల్ లైబ్రరీలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. యువతకు ఉద్యోగాలు రావడమే ఐటీ పాలసీ ప్రధాన ఉద్దేశమని సీఎం స్పష్టం చేశారు. పిల్లలకు హై ఎండ్ స్కిల్స్ నేర్పించాలంటూ అధికారులను ఆదేశించారు. హై ఎండ్ స్కిల్స్ నేర్పే సంస్థలకు ప్రోత్సాహకాలు ఇస్తామన్న సీఎం.. నైపుణ్యాలతో ప్రపంచ స్థాయిలో పోటీపడే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. ఉద్యోగాల కల్పనకు విశాఖ ప్రధాన కేంద్రం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
భవిష్యత్తులో ఐటీ రంగానికీ విశాఖ కేంద్రంగా మారుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వైజాగ్‌ను నాణ్యమైన విద్యకు కేంద్రంగా చేయాలంటూ.. ఐటీ రంగంలో అత్యుత్తమ వర్సిటీని తీసుకురావాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏర్పాటయ్యే సంస్థలకు ఏటా ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. కనీసం ఒక ఏడాది పాటు.. ఉద్యోగి అదే కంపెనీలో పని చేయాలని స్పష్టం చేశారు. ఏడాది తర్వాత సంస్థకు ప్రోత్సాహకాల చెల్లింపులు ఉంటాయని వివరించారు.