తెలంగాణ

telangana

ETV Bharat / city

విశాఖలో హైఎండ్‌ ఐటీ స్కిల్‌ వర్సిటీ: సీఎం జగన్ - ముఖ్యమంత్రి జగన్ తాజా వార్తలు

2020-2023 పారిశ్రామిక విధానంపై ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష నిర్వహించారు. పారిశ్రామికాభివృద్ధికి దోహదపడే నైపుణ్యాభివృద్ధి కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. విశాఖలో హైఎండ్‌ ఐటీ స్కిల్‌ వర్సిటీ తీసుకురావాలని జగన్​ నిర్ణయించారు.

విశాఖలో హైఎండ్‌ ఐటీ స్కిల్‌ వర్సిటీ: సీఎం జగన్
విశాఖలో హైఎండ్‌ ఐటీ స్కిల్‌ వర్సిటీ: సీఎం జగన్

By

Published : Jul 2, 2020, 5:21 PM IST

2020-2023 పారిశ్రామిక విధానంపై ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఎంఎస్‌ఎంఈలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. కాలుష్యం వెదజల్లే పరిశ్రమల విషయంలో జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. పారిశ్రామికాభివృద్ధికి దోహదపడే నైపుణ్యాభివృద్ధి కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. విశాఖలో హైఎండ్‌ ఐటీ స్కిల్‌ వర్సిటీ తీసుకురావాలని ఏపీ సీఎం జగన్​ నిర్ణయించారు.

ఐటీ రంగంలో హైఎండ్‌ ఐటీ స్కిల్‌ వర్సిటీ గొప్ప మలుపు కాగలదేనే నమ్మకాన్ని సీఎం వ్యక్తపరిచారు. వర్సిటీలో కోర్సులు, బోధన అంశాలపై నిపుణుల సలహాలు తీసుకుని... హైఎండ్‌ వర్సిటీ ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే వర్సిటీల్లో ఎక్స్‌టెన్షన్‌ మోడల్స్‌పైనా దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి:రొమాంటిక్​ క్రైమ్ స్టోరీ.. తల్లి ఫేస్​బుక్ స్నేహానికి ఐదేళ్ల కూతురు బలి

ABOUT THE AUTHOR

...view details