తెలంగాణ

telangana

ETV Bharat / city

Review: కర్ఫ్యూలో సడలింపులు.. వివాహానికి 150 మందికే అనుమతి..! - ఆంధ్రప్రదేశ్ న్యూస్ అప్​డేట్స్

కరోనా మూడో దశ ముప్పు పొంచి ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో.. ముందస్తు జాగ్రత్త చర్యలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో కర్ఫ్యూలో సడలింపులు చేశారు. వివాహాలకు 150 మందికే అనుమతి ఉంటుందని.. తెల్లవారుజూమున పెళ్లిళ్లకు ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు.

cm-jagan-review-on-covid-and-vaccination-in-ap
కర్ఫ్యూలో సడలింపులు.. వివాహానికి 150 మందికే అనుమతి..!

By

Published : Aug 17, 2021, 2:51 PM IST

కరోనా మూడో దశ నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలపై ఏపీ సీఎం జగన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కర్ఫ్యూ సడలింపులు చేసినట్లు సీఎం జగన్ తెలిపారు. తెల్లవారుజామున పెళ్లిళ్లు ఉంటే ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు. పెళ్లిళ్లలో 150 మందికే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. ఔషధ నియంత్రణ, పరిపాలన కోసం రెండు కొత్త వెబ్‌సైట్లు ఏర్పాటు చేసినట్లు సీఎం వెల్లడించారు.

కొవిడ్‌ నిబంధనలు పాటించేలా అధికారులు పర్యవేక్షించాలి. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకోవాలి. వ్యాక్సినేషన్‌లో గ్రామ, వార్డు సచివాలయాన్ని యూనిట్‌గా తీసుకోవాలి. ప్రాధాన్యతా క్రమంలో టీకాలు ఇస్తూ వెళ్లాలి. పాఠశాలల్లో సమర్థంగా కొవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలి. వైద్యారోగ్యశాఖ మార్గదర్శకాలు పాటించేలా దృష్టిపెట్టాలి. మాస్క్‌లు ధరించేలా, భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి. పాఠశాలల్లో టెస్టింగ్‌కు కూడా చర్యలు తీసుకోవాలి. ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేసేలా చూడాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 90 రోజుల్లోగా రిక్రూట్‌మెంట్‌ పూర్తిచేయాలి. ఎక్కడా కూడా సిబ్బంది లేరన్న మాట వినిపించకూడదు. ఆస్పత్రుల్లో నాడు- నేడు పనులను వేగంగా చేపట్టాలి. - ఏపీ సీఎం జగన్

ఇదీ చూడండి:Gandhi Hospital Rape: 'గాంధీ'లో అక్కాచెల్లెళ్లపై అత్యాచారం... పోలీసుల అదుపులో నలుగురు

ABOUT THE AUTHOR

...view details