కొవిడ్‌పై ఏపీ ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కర్ఫ్యూ మరింత సడలింపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కరోనా కట్టడి, వ్యాక్సినేషన్‌పై తీసుకోవాల్సిన చర్యలపైనా సమీక్షించనున్నారు.
curfew: కర్ఫ్యూ సడలింపుపై ఏపీ సీఎం నిర్ణయం తీసుకోనున్నారా? - కర్ఫ్యూ సడలింపుపై సీఎం జగన్ కామెంట్స్
కరోనా కట్టడి చర్యలపై.. ఏపీ ముఖ్యమంత్రి జగన్.. ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితిని సీఎం తెలుసుకుంటున్నారు.

కర్ఫ్యూ సడలింపుపై ఏపీ సీఎం నిర్ణయం తీసుకోనున్నారా?
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఏపీలో నిన్న విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం.. 94,595 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు(corona tests) నిర్వహించగా.. 3,175 కరోనా కేసులు (corona cases) బయటపడ్డాయి. వీటితో పాటు 29 మరణాలు నమోదయ్యాయని వైద్యాధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా నుంచి మరో 3,692మంది కోలుకోగా.. ప్రస్తుతం 35, 325కరోనా యాక్టివ్ కేసులు(corona active cases) ఉన్నాయి.
ఇదీ చదవండి:Protest: పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులను అడ్డుకున్న విద్యార్థి సంఘాలు