ఏపీలో కొవిడ్ కట్టడి(covid control) చర్యలపై సీఎం జగన్(cm jagan) సమీక్షించారు. సమావేశంలో ముఖ్యమంత్రి పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. వైద్యం కోసం ప్రజలు.. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌కు ఎందుకు వెళ్తున్నారో ఆలోచించాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని జిల్లా ప్రధాన కేంద్రాల్లో హెల్త్‌హబ్‌ల(health hubs)ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కనీసం 16 చోట్ల హెల్త్ హబ్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టాలంటూ.. ఇందుకోసం ఒక్కో చోట కనీసం 30 నుంచి 50 ఎకరాలు సేకరించాలని సూచించారు. ఒక్కో ఆస్పత్రికి 5 ఎకరాలు చొప్పున కేటాయించాలన్నారు.
మరో 16 వైద్య కళాశాలలు..
మూడేళ్లలో కనీసం రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టే ఆస్పత్రులకు భూములు ఇవ్వాలన్నారు సీఎం జగన్. దీనివల్ల కనీసం 80 మల్టీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు వస్తాయని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తరఫున మరో 16 వైద్య, నర్సింగ్ కళాశాలలు వస్తున్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలతో ప్రైవేటు రంగంలో మంచి ఆస్పత్రులు వస్తాయని వివరించారు. ప్రతి జిల్లా కేంద్రంలో, కార్పొరేషన్లలో మల్టీస్పెషాల్టీ ఆస్పత్రులు ఏర్పాటవుతాయన్నారు. ఆరోగ్య శ్రీ పథకం కింద రోగులకు మంచి ప్రమాణాలతో వైద్యం అందుతోందన్నారు.
ఇదీ చదవండి:Virinchi issue: విరించి ఆస్పత్రి ఘటనపై స్పందించిన మంత్రి కేటీఆర్