తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనా చికిత్స కోసం అదనంగా రూ.వెయ్యి కోట్లు: ఏపీ సీఎం - cm jagan on covid hospitals news

ఏపీలో కరోనా రోగులకు చికిత్స అందించేందుకు మరిన్ని ఆస్పత్రులు అందుబాటులోకి తెస్తామని సీఎం జగన్​ వెల్లడించారు. వచ్చే ఆరు నెలల్లో కరోనా చికిత్స కోసం అదనంగా రూ.1,000 కోట్లు కేటాయిస్తామన్నారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, వైద్యుల నియామకానికి చర్యలు చేపడుతున్నామని స్ఫష్టం చేశారు.

cm jagan on covid - 19
కరోనా చికిత్స కోసం అదనంగా రూ.వెయ్యి కోట్లు: ఏపీ సీఎం

By

Published : Jul 24, 2020, 4:36 PM IST

ఏపీలో కొవిడ్​ పరీక్షలు, క్వారంటైన్​ సదుపాయాల కోసం రోజుకు రూ.6.5 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సీఎం జగన్​ తెలిపారు. కరోనా వ్యాప్తి నిరోధక చర్యలపై ఆయన అధికారులతో సమీక్షించారు. వైరస్​ బాధితులకు చికిత్స కోసం అదనంగా మరో 54 ఆస్పత్రులు అందుబాటులోకి తెస్తామన్న సీఎం.. మొత్తంగా 138 ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలు అందించాలని ఆదేశించారు. క్రిటికల్‌ కేర్‌ కోసం రాష్ట్ర స్థాయిలో అదనంగా 5 ఆస్పత్రులు అందుబాటులోకి తెచ్చి.. అదనంగా 2,380 పడకలు సిద్ధం చేయాలని సూచించారు.

వచ్చే ఆరు నెలల్లో వైరస్​ బాధితులకు చికిత్స అందించేందుకు అదనంగా వెయ్యి కోట్ల రూపాయలతో మందులు కొనుగోలు చేయనున్నట్లు సీఎం జగన్​ వెల్లడించారు. ఆస్పత్రుల్లో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన, పారామెడికల్​ సిబ్బంది, వైద్యుల నియామకానికి చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.

ఇవీచూడండి:ప్లాస్మా ఇచ్చేందుకు దాతలు ముందుకు రావాలి: సజ్జనార్​

ABOUT THE AUTHOR

...view details