తెలంగాణ

telangana

ETV Bharat / city

CM JAGAN REVIEW ON ROADS : రోడ్లపై గుంతలు లేకుండా చూడండి: సీఎం జగన్​ - ఏపీ తాజా వార్తలు

ఏపీలోని రోడ్ల మరమ్మతులు, పునరుద్ధరణపై సీఎం జగన్‌ సమీక్ష(CM Jagan review) నిర్వహించారు. రోడ్ల మరమ్మతుల పనులను వెంటనే ప్రారంభించాలని సంబంధితశాఖ అధికారులను జగన్ ఆదేశించారు.

CM JAGAN REVIEW ON ROADS
AP CM JAGAN

By

Published : Nov 15, 2021, 7:18 PM IST

ఏపీలోని రోడ్ల మరమ్మతులు, పునరుద్ధరణపై సీఎం జగన్‌ సమీక్ష (CM Jagan review) నిర్వహించారు. రోడ్ల మరమ్మతుల పనులు వెంటనే ప్రారంభించాలని సంబంధిత శాఖ అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఏపీలో రోడ్లపై ఎక్కడా గుంతలు లేకుండా చేయాలని దిశానిర్దేశం చేశారు.

రోడ్ల మరమ్మతుల పనులను వెంటనే ప్రారంభించాలని సంబంధితశాఖ అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఫలితంగా వాహనదారులకు చక్కని రోడ్లు అందుబాటులోకి తేవాలని సూచించారు. రోడ్ల మరమ్మతులు, పునరుద్ధరణపై నిర్వహించిన సమీక్షలో (CM JAGAN REVIEW ON ROADS)సీఎం జగన్ ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. రోడ్లపై ఉన్న గుంతలను తక్షణమే పూడ్చాలని ఆదేశించారు. ఏపీలో 46 వేల కిలోమీటర్ల రోడ్ల మరమ్మతులపై దృష్టిపెట్టాలని సూచించారు. రోడ్ల మరమ్మతులను రాష్ట్రమంతా డ్రైవ్‌లా చేపట్టాలని అన్నారు.

వారిని బ్లాక్ లిస్టులో పెట్టండి...

జూన్ నాటికి రోడ్ల మరమ్మతులు, పునరుద్ధరణ పూర్తి కావాలని, ఏపీలో రోడ్లపై ఎక్కడా గుంతలు లేకుండా చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. గుంతలు పూడ్చాక కార్పెటింగ్ చేస్తే బాగుంటుందని సూచించారు. టెండర్లు దక్కించుకుని పనులు ప్రారంభించని వారిని బ్లాక్​లిస్టులో పెట్టాలని తెలిపారు. వచ్చే నెలలో కేంద్రమంత్రి గడ్కరీ రాష్ట్రానికి వస్తున్నారని, పెండింగ్ ప్రాజెక్టుల వివరాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్తామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు.

రోడ్లపై ఉన్న గుంతలను తక్షణం పూడ్చాలి. రోడ్ల మరమ్మతు పనులు వెంటనే చేపట్టాలి. వాహనదారులకు చక్కటి రోడ్లను అందుబాటులోకి తేవాలి. టెండర్లు దక్కించుకొని పనులు ప్రారంభించని వారిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలి. జూన్ నాటికి రోడ్ల మరమ్మతులు, పునరుద్ధరణ పూర్తి కావాలి. వచ్చే నెలలో కేంద్రమంత్రి గడ్కరీ రాష్ట్రానికి వస్తున్నారు. పెండింగ్‌ ప్రాజెక్ట్‌ల వివరాలను గడ్కరీ దృష్టికి తీసుకెళ్తాం.

- వైఎస్.జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి

ఇదీచూడండి:రేపు టీఆర్​ఎస్​ఎల్పీ కీలక భేటీ.. దిల్లీలో రైతుదీక్ష?

ABOUT THE AUTHOR

...view details