అమ్మఒడి స్ఫూర్తి కొనసాగాలి, పిల్లలంతా బడిబాట పట్టాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ (cm jagan news) అన్నారు. 2022 నుంచి అమ్మఒడి పథకం.. హాజరుకు అనుసంధానం చేయాలని ఆదేశించారు. 75 శాతం హాజరు ఉండాలని ఇదివరకే నిర్దేశించుకున్నామని.. ఈ ఏడాది ఈ నిబంధనను పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు.
విద్యాశాఖపై సమీక్షించిన సీఎం.. స్కూళ్ల నిర్వహణ, విద్యార్థుల హాజరుతో పాటు అమ్మఒడి, విద్యాకానుకపై చర్చించారు (CM Jagan review meeting on education department news). కరోనా తర్వాత పాఠశాలల్లో పరిస్థితులు, హాజరుపై ఆరా తీశారు. స్కూళ్ల పనితీరుపై ర్యాంకింగ్‌లు ఇస్తామంటూ అధికారులు ప్రతిపాదన చేశారు. సోషల్ అడిట్ ద్వారా ర్యాంకింగ్‌లు ఇస్తామని తెలిపారు. దీనిపై స్పందించిన జగన్... ఏ మార్పులైనా ఉపాధ్యాయులతో మాట్లాడాలని అన్నారు.