తెలంగాణ

telangana

By

Published : Dec 28, 2021, 2:06 PM IST

ETV Bharat / city

Welfare schemes in AP: 'కుల మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు'

Welfare schemes in AP: కుల మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఏపీ సీఎం జగన్​ అన్నారు. కొవిడ్‌ సమయంలో ప్రభుత్వ రాబడి తగ్గినా ప్రజలకు ఏదీ ఆపలేదన్నారు. అర్హత ఉన్నా ఏదైనా కారణంతో వివిధ సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందని 9,30,809 మంది ఖాతాల్లో నగదు జమ చేశారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలన్నారు.

ఏపీ సీఎం జగన్
ఏపీ సీఎం జగన్

Welfare schemes in AP: పేదలకు అండదండలు అందించే విషయంలో ఏ మాత్రం రాజీపడలేదని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. కొవిడ్‌ సమయంలో ప్రభుత్వ రాబడి తగ్గినా ప్రజలకు ఏదీ ఆపలేదని చెప్పారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలన్నారు. అర్హత ఉండి మిగిలిపోయిన వారికి నగదు జమ చేస్తున్నట్లు చెప్పారు. కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని జగన్‌ తెలిపారు. అర్హత ఉండి.. ఏదైనా కారణంతో వివిధ సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందని 9,30,809 మంది ఖాతాల్లో సీఎం రూ.703కోట్లను జమ చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి ఈ మొత్తాన్ని విడుదల చేశారు.

CM jagan news: ‘‘అందరికీ న్యాయం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. గత ప్రభుత్వ బకాయిలు కూడా కలిపి చెల్లిస్తున్నాం. 2019-20 రబీకి సంబంధించి రూ.9కోట్లు జమ చేస్తున్నాం. పొదుపు సంఘాలకు మరో రూ.53కోట్లు, జగనన్న వసతి దీవెన పథకంలో రూ.39కోట్లు, జగనన్న విద్యా దీవెన పథకంలో రూ.19కోట్లు, వైఎస్సార్‌ కాపు నేస్తం పథకంలో రూ.19కోట్లు జమ చేస్తున్నాం’’ అని జగన్‌ చెప్పారు. వీటితోపాటు వాహనమిత్ర, మత్స్యకార భరోసా, నేతన్ననేస్తం తదితర పథకాలకు సంబంధించి అర్హుల ఖాతాల్లో నగదు జమ చేశారు.

ఇదీ చూడండి:'ఇళ్ల ధరల పెరుగుదలలో దేశంలోనే హైదరాబాద్ టాప్​'

ABOUT THE AUTHOR

...view details