వైఎస్‌ఆర్ వాహనమిత్ర మూడో ఏడాది ఆర్థికసాయాన్ని ఏపీ సీఎం జగన్ విడుదల చేశారు. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు పదివేల రూపాయల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి ఆన్‌లైన్ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి సీఎం జగన్ నిధులు జమ చేశారు. 2,48,468 మంది లబ్ధిదారులకు 248 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక సాయం లభిస్తోంది.
వాహనమిత్ర మూడో ఏడాది ఆర్థిక సాయం విడుదల చేసిన ఏపీ సీఎం - వైఎస్‌ఆర్ వాహనమిత్ర మూడో ఏడాది ఆర్థికసాయం విడుదల చేసిన సీఎం
వైఎస్‌ఆర్ వాహనమిత్ర మూడో ఏడాది ఆర్థిక సాయాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. ఈ పథకం కింద ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు పదివేల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది.
వైఎస్సార్ వాహనమిత్ర పథకంలో దాదాపు 84 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల వారే ఉన్నారని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. వారందరి బతుకులు మార్చేందుకు ఏటా ఆర్థిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు. వైఎస్సార్ వాహనమిత్ర మూడో విడత ఆర్థికసాయాన్ని.. ప్రతి ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు పది వేల చొప్పున అందిస్తామని చెప్పారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతోందన్న ఆయన.. అర్హులైన వారంతా దరఖాస్తు చేసుకోనేందుకు మరో నెల రోజులు గడువు పొడిగిస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి:Etela : హైదరాబాద్ చేరుకున్న ఈటల బృందం
TAGGED:
ఏపీ తాజా వార్తలు