YSR Rythu Bharosa Funds : వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ నిధులను ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ నేడు విడుదల చేశారు. క్యాంపు కార్యాలయం నుంచే 50.58 లక్షల మంది రైతులకు.. రూ.1036 కోట్లను... రైతుల ఖాతాల్లో జమ చేశారు.
YSR Rythu Bharosa Funds: 'వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్' నిధుల విడుదల - తెలంగాణ వార్తలు
YSR Rythu Bharosa Funds : వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ నిధులను ఏపీ సీఎం జగన్.. ఈరోజు విడుదల చేశారు. క్యాంపు కార్యాలయంలం నుంచే రూ. 1036 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు.
![YSR Rythu Bharosa Funds: 'వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్' నిధుల విడుదల YSR Rythu Bharosa Funds, ap cm jagan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14081148-156-14081148-1641195859459.jpg)
వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్' నిధుల విడుదల
'రైతు భరోసా కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏటా ప్రభుత్వం.. రూ. 13 వేల 500 అందిస్తోంది. తొలి విడతగా పంట వేసేముందు మే నెలలో 7 వేల 500, రెండో విడతగా అక్టోబరులోపు రూ. 4వేలు, మూడో విడతగా సంక్రాంతికి రూ. 2వేలు ఇస్తున్నారు. ప్రస్తుతం విడుదల చేస్తున్న మొత్తంతో కలిపి రూ. 19,813 కోట్ల సాయాన్ని రైతులకు అందించాం' అని ఆ రాష్ట్ర సర్కారు తెలిపింది.
ఇదీ చూడండి:Nandamuri Ramakrishna: 'ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసమంటే.. తెలుగుజాతిని అవమానించినట్లే..'